BRS MLA తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
BRS MLA తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తనపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుందని తనమీద అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో తనపై ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలను తప్పకుండా తిప్పి కొడతా అని అన్నారు. జరిగిన విషయాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తనని స్పష్టం చేశారు. ఇటీవల ఓ మహిళా సర్పంచ్ ఎమ్మెల్యే వేధింపులు చేస్తున్నారని చేసిన ఆరోపణలపై రాజయ్య స్పందించారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed