- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోడు.. మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ఎనిమిది నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే ఒక ఫ్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని అన్నారు. అసలు సీఎంకు మహిళలు అంటే గౌరవం లేదని తెలిపారు. తాలిబన్ వారసుడిగా వ్యవహారం ఉంది రేవంత్ రెడ్డి తీరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పైన మాట్లాడిన భాష చూశాం. ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి సబితా ఇంద్రారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు.
తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని, నిరసన చేశాం. అయినప్పటికీ సీఎం కనుసైగల్లో స్పీకర్ పని చేస్తున్నారు. నిరసన తెల్పుతున్న మమ్మల్ని కిరాతకంగా మార్షల్స్‌తో అరెస్ట్ చేశారు. నాలుగున్నర గంటలు మహిళా ఎమ్మెల్యేలు నిలబడి అడిగినా అవకాశం ఇవ్వలేదు. చివరి మాట్లాడకుండానే సభ వాయిదా వేశారు. అహంకారిలా, ఫ్యూడల్‌గా, అపరిచితుడిలాగా రేవంత్ రెడ్డి తీరు కన్పిస్తుంది. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. కేసీఆ రాజకీయ ప్రస్తావన గురించి మాట్లాడే మొనగాడివా రేవంత్. ఆయన కాలి గోటికి కూడా సరిపోదు నీ మొహం’’ అని సీఎంపై ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.