- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ను ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదు: కడియం
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ముక్కలు చేసే వాళ్లు ఇంకా పుట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులకు పైగా అవుతోందని.. నాటి నుంచి అభివృద్ధిని పక్కనబెట్టి నిర్విరామంగా బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సీఎం సహా మంత్రులంతా తిడుతుంటే తాము పడాలా? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి పదవి వచ్చాక కూడా రేవంత్‌లో మార్పు కనపడటం లేదని.. కొంచెం హుందాగా ఉండటం నేర్చుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదన్నారు. గతంలో కేటీఆర్ దావోస్ వెళ్లినప్పుడు కేటీఆర్ ఎంతో హుందాగా ప్రవర్తించారు. పెట్టుబడులు సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. దేశంలోనే రోల్ మోడల్ తెలంగాణాను అభివృద్ధి చేసింది కేసీఆరే. అలాంటి కేసీఆర్‌ను తూలనాడడం కరెక్ట్ కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్‌ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభం అయిందని తెలిపారు. కేసీఆర్‌ను అనవసరంగా ఓడించామని బాధపడుతున్నారని అన్నారు.