‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో BRS లూటీ’

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-08 09:27:20.0  )
‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో BRS లూటీ’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆగమేఘాల మీద ప్రగతి భవన్ నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సామాన్యుడికి ఇంటిని ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతున్నారని సీడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్ ప్రశ్నించారు. 5.72 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. రెండుసార్లు అధికారం చేపట్టి ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కంటే మెరుగైన రీతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసం చేశారని దుయ్యబ్టటారు.

నిర్మించిన అరకొర డబుల్ బెడ్ బెడ్ రూమ్ ఇళ్లు అయినా నాణ్యతతో నిర్మించలేదని, చిన్న వర్షాలకే అవి ఉరుస్తున్నాయన్నారు. పలు చోట్ల కట్టిన ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేదన్నారు. కామారెడ్డిలో కట్టిన ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, పెచ్చులు ఊడిపడుతున్నాయన్నారు. 23,600 కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించామని చెప్పిన సర్కారు.. ఇళ్ల నిర్మాణం కోసం కేవలం రూ.300 కోట్లే ఇచ్చిందని ఆరోపించారు. హీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 8 చోట్ల మాత్రమే ప్రాజెక్ట్‌లను చేపట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అవినీతిమయంగా మార్చేసి నాణ్యత పాటించకుండా నిర్మించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed