గన్ పార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వండి.. కమిషనర్‌కు బీఆర్ఎస్ లేఖ

by Ramesh N |
గన్ పార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీకి అనుమతి ఇవ్వండి.. కమిషనర్‌కు బీఆర్ఎస్ లేఖ
X

దశ, డైనమిక్ బ్యూరో: జూన్ 1న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ముగింపు వేడుకల నేపథ్యంలో గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయుకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే అనుమతి లెటర్‌ను కమిషనర్ ఓఎస్డీకి బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఇచ్చారు. కాగా, ప్రభుత్వానికి దీటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు.

ఈ నెల 1 నుంచి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జూన్ 2వ తేదీన అమ‌రుల స్మృతిని పుర‌స్క‌రించుకుని అమ‌రుల కుటుంబాల‌ను స‌త్క‌రించ‌నున్నారు. ఆర్థిక సాయం కూడా చేయ‌నున్నారు. ఇక‌, జూన్ 3న రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌దేళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా భారీ సభను హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ సెంట్ర‌ల్ ఆఫీస్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

Next Story