ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు.. బాధితులకు నిత్యావసరాల పంపిణీ

by Mahesh |
ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు.. బాధితులకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీ వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా సామాన్య ప్రజల నుంచి రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ వరదలను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటనకు భయలుదేరింది. ఇందులో భాగంగా మొదట సాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడిన హరీష్ రావు పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే అక్కడి నుంచి బయలుదేరి ఖమ్మం చేరుకుని మున్నేరు వాగు ఉధృతి కారణంగా నష్టపోయిన వరద బాధిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు బాధితులకు హారం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందని.. ఎవరు అధైర్య పడొద్దని అన్నారు. కాగా ఈ కార్యమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, జిల్లా ఇంచార్జులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed