BRS: హరీష్ రావు వ్యాఖ్యలనుతప్పుగా అర్థం చేసుకున్నారు

by Gantepaka Srikanth |
BRS: హరీష్ రావు వ్యాఖ్యలనుతప్పుగా అర్థం చేసుకున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు సంబంధించిన అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై నిన్న హరీష్ రావు మాట్లాడారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం కుప్పకూల్చిందని హరీష్ రావు అన్నారు. పోలీసు అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ నేత జి.దేవిప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో మాట్లాడారు. పోలీసులు, పోలీసు అధికారుల పట్ల మాకు గౌరవం ఉందని అన్నారు. హరీష్ రావు నిరంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల మాట్లాడుతున్నారు. పోలీసు అధికారులు కొంతమంది ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో నలుగురు మాజీమంత్రులు పర్యటన చేస్తే దాడులు జరిగాయి. కనీసం పోలీసులు స్పందించలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్‌లో కేసీఆర్ అనేక సంస్కరణలు చేశారని గుర్తుచేశారు. పోలీస్ స్టేషన్లకు స్టేషనరీ ఖర్చులు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. పోలీసులకు కొత్త ఇన్నోవాలు ఇచ్చారు. 47 వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్ నియామకం చేపట్టారు. శాంతిభద్రతల వైఫల్యం ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నాం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకటి రెండు మినహా ఎన్ కౌంటర్లు జరగలేదు. కాంగ్రెస్ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్ కౌంటర్లు ప్రారంభమయ్యాయని విమర్శించారు.

Advertisement

Next Story