- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వద్ద డబ్బు తీసుకొని మరీ కడియం పార్టీ మారిండు.. బీఆర్ఎస్ నేత ప్రకాష్ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: కడియం శ్రీహరి కాంగ్రెస్ చేరిక వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్‌లో చేరడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఎవరికీ ఇవ్వని అవకాశాలు కడియం శ్రీహరికి ఇచ్చారని.. ఓడిపోయిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారని, ఎమ్మల్సీ ఉండగానే ఎమ్మెల్యే ఇచ్చారని, అంతకుముందు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం చేశారని.. ఇన్ని అవకాశాలు కల్పించినా స్వార్థ కోసం పార్టీ మారాడని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై బీఆర్ఎస్ నేతలు కీలక ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత వీ. ప్రకాశ్ కడియం శ్రీహరిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని మరీ కడియం శ్రీహరి మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎంతో మంది మోసం చేశారు.. కానీ, కడియం శ్రీహరి చేసిన మోసం చాలా పెద్దదన్నారు.