Rakesh Reddy: కాంగ్రెస్ నేతల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు

by Gantepaka Srikanth |
Rakesh Reddy: కాంగ్రెస్ నేతల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: పది నెలల కాంగ్రెస్(Congress) పాలన చూసిన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి(Rakesh Reddy) విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. అకాల వర్షాలతో వరి ధాన్యం తడుస్తోంది. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి ఇప్పుడు మిల్లర్లు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని ఏపీ మిల్లర్లు కొనుక్కుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధాన్యం కేంద్రాలు ప్రారంభించి రీల్ లీడర్లుగా మిగిలారు. రైతులను దళారులు మోసం చేస్తున్నారు.

అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు వెళ్లడం లేదు అని అడిగారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్లకే పరిమితం అయ్యారని విమర్శించారు. సీసీఐ ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో ఇచ్చిన రైతు డిక్లరేషన్(Rythu Declaration) ఏమైందని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్ కాదు.. వంచన డిక్లరేషన్ అని అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల గుండెల్లో ఉన్నారు. భయం రూపంలో కాంగ్రెస్ నేతల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్‌ను ఎందుకు తిడుతున్నారో సమాధానం చెప్పాలి. వ్యవసాయాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించిందే కేసీఆర్ అని అన్నారు. డిసెంబర్ నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే జనవరిలో సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్‌లో స్కామ్ చేశారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed