హైదరాబాద్‌కు మూసీ ఒక వరం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
హైదరాబాద్‌కు మూసీ ఒక వరం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Haidarabad) మహా నగరానికి మూసీ నది(Musi River) ఒక వరమని, ఆ వరాన్ని మురికికూపంగా మార్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government)మే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. శనివారం నాగోల్‌లోని ఎస్టీపీ కేంద్రాన్ని జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల పాపం వల్ల మూసీ మురికిగా మారిందని అన్నారు. గత పాలకులు అంటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీనే అని చెప్పారు.

ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఎస్టీపీ ప్లాంట్‌ హైదరాబాద్‌లో ఉందని తెలిపారు. ప్రతి రోజు ఉత్పత్పి అయ్యేది 2000 ఎల్‌ఎండీల మురికి నీళ్లు అని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఎస్టీపీతోనే ఇప్పుడు 20 కోట్ల లీటర్ల మురికినీరు శుద్ధి అవుతోందని తెలిపారు. అసలు హైదరాబాద్‌కు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన పనులకే రిబ్బన్లు కట్ చేస్తూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ చివరి వరకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితుల తరపున న్యాయ పోరాటం చేయడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed