- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS: జగిత్యాల ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేయాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

దిశ, వెబ్ డెస్క్: కౌశిక్ రెడ్డితో పాటు జగిత్యాల ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్(Karimnagar) లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kowshik Reddy), జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) మధ్య తోపులాట జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూకి హాజరై వస్తున్న కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్ లో పోలీసులు అదుపులోకి తీసుకొని, కరీంనగర్ తరలించారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా..పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన వాగ్వాదానికి కేవలం బీఆరెస్ నేత పైనే మూకుమ్మడి దాడి, మూడు కేసులు, ఆఘమేఘాల మీద పండగ పూట అరెస్టులా? అని ప్రశ్నించారు. అలాగే కౌశిక్ ఎమైనా ఉగ్రవాదా? అని మండిపడ్డారు. ఇక ఇందులో జగిత్యాల ఎమ్మెల్యే కూడా నిందితుడే కదా, ఆయన్ను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ డీజీపీ(Telangana DGP)ని ట్యాగ్ చేశారు.