- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRS: ఇన్ని జరుగుతున్నా చలనం లేకపోవడం సిగ్గుచేటు.. సీఎంపై హరీష్ రావు ఫైర్

దిశ, వెబ్ డెస్క్: నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు (food poisoning incidents) జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు (BRS leader Tanniru Harish Rao) అన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)పై విమర్శల వర్షం కురిపించారు. దీనిపై నిన్న కందుకూరు గురుకులం ( Kandukur Gurukulam)లో ఫుడ్ పాయిజన్ జరిగి 84 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని, నేడు సూర్యాపేట జిల్లా (Suryapet District) కేంద్రంలోని గిరినగర్ (Girinagar) సమీపంలోని ఎస్టీ హాస్టల్ (ST Hostel)లో ఫుడ్ పాయిజన్ జరిగి 12 మంది విద్యార్ధులకు ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గురుకులల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నిత్యకృత్యమవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అలాగే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటలు నీటి మూటలే అయ్యాయని ఆరోపించారు. ఇక మాటలే తప్ప చేతలు లేని తెలంగాణ సీఎం (Telangana CM) నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని మండిపడ్డారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఫుడ్ పాయిజన్లు నిరోధించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా రంగారెడ్డి జిల్లా (Rangareddy district) నాదర్‌గుల్ (Nadargul)లోని కందుకూరు గురుకుల వసతి గృహంలో గణతంత్ర దినోత్సవం రోజు స్వీట్లు తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం బయటపడకుండా అధికారులు స్కూల్ కే నర్సును పిలిపించి వైద్యం చేయించినట్లు తెలిసింది. ఇందులో కొందరి పరిస్థితి విషమించడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి (Vanasthalipuram Area Hospital) తరలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ ను నిలదీశారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులను లోపలికి రానివ్వకుండా తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కలగజేసుకుని తల్లిదండ్రులను స్కూల్ లోకి అనుమతించారు. పిల్లలు అస్వస్థతకు గురైనా తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం జరగలేదని, పిల్లలకు వైద్యం చేయించామని ప్రిన్సిపాల్ పోలీసులకు వెల్లడించారు.