- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూపులుగా విడిపోయిన BRS.. సిట్టింగ్‌కు కష్టమే..!
దిశ, రంగారెడ్డి, బ్యూరో/ శంషాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడో ధపా అధికారం చేపట్టాలనే ఉత్సహాంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా అధిష్టానం సర్వేలు నిర్వహిస్తుంది. సర్వేలల్లో పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని టికెట్ ఆశించే వారిపై ప్రజల అభిప్రాయం చేపడుతుంది. అయితే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ముగ్గురు వ్యక్తులు టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డిలతో పాటు కార్తీక్ రెడ్డిలు ఎవరికివారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ప్రకాశ్ గౌడ్ నియోజకవర్గ ఏర్పాడిన నాటి నుంచి నేటి వరకు మూడు ధపాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేపై బలమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలతో ఎమ్మెల్యేపై ప్రజలల్లో వ్యతిరేకత పెరిగిపోయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం ప్రతి అసెంబ్లీ సీటు గెలిచే అభ్యర్ధులకే ఇవ్వాలని యోచిస్తోంది. వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి చేసింది శూన్యమనే ప్రచారం సాగుతుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సింప్లెక్స్ వద్ద దాదాపు రూ. 500 కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అల్లుడు కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
హెచ్ఎండి అధికారులు ఆ నిర్మాణాలను కూల్చివేయడంతో ఆరోపణలు నిజమనే సంగతి అందరికీ తెలిసింది. కేవలం ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బంధువులు భూ దందాలు చేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసినట్లు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో అందినకాడికి భూ కబ్జాలు చేశారని ప్రతిపక్ష పార్టీలు లోల్లిపెడుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో ప్రకాశ్ గౌడ్‌కు బీఆర్ఎస్ టికెట్ దక్కితే గెలవడం కష్టమేనంటూ ప్రచారం సాగుతుంది. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి, కార్తీక్ రెడ్డిలల్లో ఎవరికో ఒక్కరికి టికెట్ దక్కే అవకాశం ఉండోచ్చని చర్చ సాగుతుంది.
అంతర్గత గ్రూపులను ప్రోత్సహిస్తున్న ఎంపీ..
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికి అంతర్గతంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని కార్పోరేషన్, మున్సిపాలిటీలోని కార్పోరేటర్లు, కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. గతంలో బండ్లగూడ జాగీర్ కార్పోరేషన్ మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలని తెరపైకి తీసుకవచ్చారు. దీంతో మేయర్, డిప్యూటి మేయర్లు రెండు వర్గాలుగా విడిపోయాయి.
గౌడ, రెడ్డి సామాజిక వర్గాల వారీగా గ్రూపులుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారు. ప్రకాశ్ గౌడ్ వెంట రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పటికి టికెట్ దక్కకుంటే ఎంపీ వెంటనే నడుస్తారనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఎంపీ రంజిత్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే టికెట్ తమ నేతకే వస్తుందనే ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితుడు ఎంపీ రంజిత్ రెడ్డి అనే ప్రచారం అనుచరులు చేస్తోన్నారు. ఎంపీ అనుచరుల ప్రచారంతో అంతర్గత గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు చర్చ తెరపైకి వచ్చింది.
ఎమ్మెల్యే వ్యతిరేకతకు ఇదే నిదర్శనం...
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. ప్రకాశ్ గౌడ్‌కు ఈ డివిజన్లల్లో పెద్దగా పట్టు లేదని చెప్పలి. ఎందుకంటే 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అత్తాపూర్, మైలార్దేవరపల్లి, రాజేంద్రనగర్ డివిజన్లు బీఆర్ఎస్పార్టీ గెలుపోందగా... శాస్త్రీపురం, సులేమాన్ నగర్ డివిజన్లు ఎంఐఎం గెలిచాయి. ప్రకాశ్ గౌడ్ టీడీపీని వీడీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకాశ్ గౌడ్, కాంగ్రెస్, టీడీపీ పోత్తుల్లో భాగంగా టీడీపీ అభ్యర్ధి గణేష్ గుప్తాలు బరిలో నిలిచారు.
అయితే అప్పట్లో కాంగ్రెస్ నుంచి కార్తీక్ రెడ్డి బరిలో ఉంటారని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు చర్చ సాగింది. కానీ పార్టీ ఆదేశాల ప్రకారం టీడీపీ మద్దతుగా పనిచేయాల్సి వచ్చింది. దీంతో తిరిగి ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపోందారు. ప్రకావ్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఐదు డివిజన్లల్లో ఓటమి పాలైయింది. నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల ఓట్లు కీలకమని పార్టీ భావిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యే వ్యవహారం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మౌనంగా అడుగులు వేస్తున్న కార్తీక్ రెడ్డి...
ఒకప్పుడు రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్ మండలాలన్ని చేవెళ్ల నియోజకవర్గంలో భాగం. ఈ చేవెళ్ల నియోజకవర్గం ఇంద్రారెడ్డికి అడ్డగా చేప్పుకుంటారు. అయితే నియోజకవర్గాల పునర్ విభజనతో చేవెళ్ల, రాజేంద్రనగర్‌గా విడిపోయాయి. దీంతో చేవెళ్ల ఎస్సీ రిజర్వ్, రాజేంద్రనగర్ జనరల్ స్ధానం కావడంతో ఇంద్రారెడ్డి ఫ్యామీలి నుంచి నియోజకవర్గాలు చేజారి పోయాయి. అయితే రాజేంద్రనగర్ నుంచి ఇంద్రారెడ్డి ఫ్యామీలి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ పార్టీ నిర్ణయం ప్రకారం కుటుంబంలో ఒక్కరికే టికెట్ అనే నిబంధనతో వదులుకోవాల్సి వచ్చింది.
ఇంద్రారెడ్డి కుటుంబంలోని సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం నియోజకవర్గం కేటాయించడంతో రాజేంద్రనగర్ నుంచి పోటికి దూరమైయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో జ్క్షానేశ్వర్ ముదిరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2018లో రాజేంద్రనగర్ నుంచి బరిలో ఉండాలని కార్తీక్ రెడ్డి భావించారు. కానీ కాంగ్రెస్, టీడీపీల పోత్తుల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం టీడీపీకి కేటాయించడంతో మళ్లీ వెనక్కితగ్గాల్సి వచ్చింది. అయినప్పటికి ఇంద్రారెడ్డి కుటుంబం ఇప్పటికి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ఏలాంటి వర్గాలకు అవకాశం లేకుండా పనిచేసుకుంటూ పోతున్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి కార్తీక్ రెడ్డి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : రైతులకు మళ్లీ Bad News.. ఐదున్నర గంటల భేటీలో రుణమాఫీపై క్యాబినెట్ సైలెంట్..!