- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kavitha Arrest : BRS చీఫ్ కేసీఆర్ ఎక్కడ అని జోరుగా చర్చ..?
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ కవితను అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఆమెను ఢిల్లీకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ విచారణ అధికారితో వాగ్వావాదానికి దిగారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ ముగిసే వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోమని చెప్పి.. ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. కూతురు కవిత అరెస్ట్‌పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎక్కడ స్పందించలేదు.
కేటీఆర్, హరీష్ రావు కవిత ఇంటికి వచ్చిన కేసీఆర్ మాత్రం రాలేదు. మీడియాతో కూడా కవిత అరెస్ట్‌పై గులాబీ బాస్ ఎక్కడ మాట్లాడలేదు. పార్లమెంట్ ఎన్నికల వ్యుహాల్లో బిజీగా ఉన్న కేసీఆర్.. కూతురు అరెస్ట్‌పై స్పందించకపోవడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని జోరుగా చర్చ జరుగుతోంది. కూతురు అరెస్ట్‌పై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నది హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం వరకు హైదరాబాద్ నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించిన కేసీఆర్.. ఇవాళే ఫామ్ హౌజ్‌కు వెళ్లినట్లు సమాచారం. మరీ కవిత అరెస్ట్‌పై కేసీఆర్ ఎప్పుడూ స్పందిస్తారో చూడాలి. కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత అరెస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
Read More..
కవిత ఇంటి వద్ద BRS నేతల ఆందోళన.. MLC నివాసం వద్ద హై టెన్షన్..!