- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS: ఆయనను స్మరించుకునే అవకాశం ఇవ్వరా..? కేటీఆర్ సంచలన ట్వీట్
దిశ, వెబ్ డెస్క్:రాజ్యంగం మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ఆ రాజ్యాంగం రచించిన అంబేద్కర్(Br. Ambedkar)ని స్మరించుకునే అవకాశం ఇవ్వట్లేదని అని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్(BRS Working President KTR) మండిపడ్డారు. 125 అడుగుల అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు(Tribute) అర్పించేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై స్పందిస్తూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు.
దీనిపై ఆయన.. రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతాడని, ఆ రాజ్యాంగం రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్(KCR) గౌరవంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్(Hussien Sagar) తీరాన సగౌరవంగా ప్రతిష్టించారని గుర్తు చేశారు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ కనీసం మహనీయుడు అంబేద్కర్ జయంతి, వర్ధంతులకు కనీసం దండేసి, దండంపెట్టి స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. కేసీఆర్ కట్టిన సచివాలయంలో, పోలీస్ కంట్రోల్ రూమ్ లో సమీక్షలు చేస్తూ..!, కేసీఆర్ కట్టిన ప్లై ఓవర్లను, యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభిస్తూ..!, కేసీఆర్ ప్రతిష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిర్భంధిస్తారా? అని ప్రశ్నించారు. అంతేగాక ఇది దళితుల మీద కక్ష్యా..? లేక మహనీయులు అంబేద్కర్ గారి మీద వివక్షా..? అని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.