- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రహస్య ఎజెండా వెళ్తున్నారు.. ఢిల్లీలో కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోబుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అవుతాయని చెప్పామని గుర్తుచేశారు. ఒక రహస్య ఎజెండాగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వెళ్తున్నాయని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫ్రెండ్లీ అండర్ స్టాండింగ్‌తో ఆ పార్టీలు పోటీ చేశాయని ఆరోపించారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసిన విచారణ జరపలేదని మండిపడ్డారు.