ప్రేమలో బీఆర్ఎస్-బీజేపీ..? మరోసారి పెళ్లి కార్డు చక్కర్లు

by Ramesh N |
ప్రేమలో బీఆర్ఎస్-బీజేపీ..? మరోసారి పెళ్లి కార్డు చక్కర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్- బీజేపీ పార్టీల మధ్య రహస్య సంబంధం ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బీఆర్ఎస్- బీజేపీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ రెండు పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాగా, గతంలో ప్రేమలో బీఆర్ఎస్ లవ్ బీజేపీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి ప్రేమలో బీఆర్ఎస్ లవ్ బీజేపీ పెళ్లి కార్డు ఫోటోలు సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బజ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ‘కీలక దశకు చేరుకున్న బీఆర్ఎస్ విలీన ప్రక్రియ అంటూ ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ రష్యా పర్యటన ముగియగానే ఢిల్లీకి కేసీఆర్ వెళ్తాడు’ అంటూ పోస్టులో నెటిజన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed