భద్రాచలం నియోజకవర్గ BRS ఇన్‌చార్జి మళ్లీ మార్పు

by GSrikanth |   ( Updated:2023-04-11 14:43:33.0  )
భద్రాచలం నియోజకవర్గ BRS ఇన్‌చార్జి మళ్లీ మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణను అధిష్టానం నియమించింది. ఎస్టీ నియోజకవర్గమైన భద్రాచలానికి ఇంతకాలం వెంకట్రావ్ ఇన్‌చార్జిగా కొనసాగారు. అయితే, వెంకట్రావ్ మాజీ ఎంపీ పొంగులేటి వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుంటంతో వెంకట్రావ్‌ను పక్కన పెట్టి బాలసానికి ఇన్‌చార్జీగా బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇప్పటివరకు విజయం సాధించింది లేదు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్, సీపీఎంలకు కంచుకోటగా ఉంది. దీంతో ముందు ఇన్‌చార్జిగా నియమించిన ఎంపీ మాలోతు కవిత కొనసాగలేని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

దీంతో ఆమె విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న అధిష్టానం తిరిగి భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండ్రోజుల్లోనే పార్టీ ఇన్‌చార్జిని మార్చడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి ప్రభావం ఉండటంతోనే ఇన్‌చార్జి మార్పు జరిగిందనే ప్రచారం జరుగుతోంది. కాగా, లక్ష్మీనారాయణ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. ఆయనకు అక్కడ పోటీ చేసే అవకాశం లేదు. దీంతో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరో ఎస్టీ నేతను వెతుక్కోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్‌కు ఏర్పడింది. పార్టీ బలంగా ఉన్నప్పటికీ భద్రాచలంలో మాత్రం పార్టీకి ప్రజాగుర్తింపు కలిగిన నేత లేకపోవడం గమనార్హం.

Also Read..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి క్యూబా ప్రభుత్వ ఆహ్వానం

Advertisement

Next Story

Most Viewed