- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై మరో కేసు నమోదు.. భూమి కబ్జా చేశారని ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: మానుకోట(Manukota) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్(Shankar Nayak) పై మరో కేసు నమోదు అయ్యింది. తమ భూమిని ఆక్రమణకు గురి చేశారని ఓ మహిళ హనుమకొండ(Hanumakonda)లోని సుబేదారి పోలీస్ స్టేషన్(Subedari Police Station) లో ఫిర్యాదు(Complaint) చేసింది. హంటర్ రోడ్డు దుర్గాదేవి కాలనీలో 500 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, అతని అనుచరులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తనకు పసుము కుంకుమల కింద వచ్చిన ఇంటి స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే అనుచరులు కబ్జాకు ప్రయత్నించడమే గాక.. ఇదేమిటని అడిగిన తమపై దాడి చేసి, లక్ష ఇరవై వేల రూపాయల ఫోన్లు లాక్కొని, చంపుతామని బెదిరించి వెళ్లారని తెలిపారు. అంతేగాక ఆక్రమణకు గురి చేసిన స్థలంలో ఉన్న 3 లక్షల విలువ చేసే కంటైనర్ హోమ్(Container Home)తో పాటు ఇతర వస్తువులు దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక శంకర్ నాయక్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని వెంటనే వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే గా ఉన్న శంకర్ నాయక్ భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇదివరకే పలు కేసులు నమోదు అయ్యాయి.