బ్రేకింగ్ : CM KCR హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-08 09:25:40.0  )
బ్రేకింగ్ : CM KCR హెలికాప్టర్‌లో మరోసారి సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో మరో సారి సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో చాపర్ ను పైలట్ వెంటనే నిలిపివేశాడు. ఇక, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తిరిగి బయలు దేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మార్గాన ఆసిఫాబాద్‌కు సీఎం కేసీఆర్ బయలు దేరి వెళ్లారు. ఇక, ఇటీవల దేవరకద్ర ఎన్నికల ప్రచారానికి ఎర్రవల్లి నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరుతుంగా హెలికాప్టర్ మొరాయించడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే.

Next Story