బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్

by Satheesh |   ( Updated:2023-03-17 08:41:02.0  )
బ్రేకింగ్: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. పోలీసులు బండి సంజయ్ దీక్షను భగ్నం చేయడంతో ఆయన కార్యకర్తలతో కలిసి ర్యాలీగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ కార్యకర్తలు సొమ్మసిల్లి కిందపడిపోయారు. దీంతో గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed