- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: బీజేపీలో చేరిక అంశంపై స్పందించిన ఎంపీ నామా.. పునరాలోచనలో పడిన కమలనాథులు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైనా బీజేపీ అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ వరంగల్, ఖమ్మం ఎంపీ సీటుపై మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీలో చేరడంతో ఆయనకు దాదాపు టికెట్ ఖయమైనా.. అధికారికంగా వెల్లడించ లేదు. అదేవిధంగా ఖమ్మం సీటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వర రావును పార్టీలో చేర్చుకుని టీడీపీతో పొత్తులో భాగంగా ఖమ్మం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేసింది.
ఈ మేరకు ఆయనతో రాష్ట్ర బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని టాక్. ఈ క్రమంలోనే నామా తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏ పార్టీలోనూ చేరట్లేదని, బీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. దీంతో కమలనాథులు పునరాలోచనలో పడ్డారు. మరోవైపు ఇటీవలే బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో ఆయన టికెట్ ఇచ్చేది అనుమానంగానే ఉంది. దీంతో ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఎల్లుండి తెలంగాణ బీజేపీ నేతలంతా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 22న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ సమావేశంలో ఖమ్మం సీటుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.