బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుల విడుదల.. వెంటనే మరో షాక్ ఇచ్చిన పోలీసులు

by Mahesh |   ( Updated:2022-12-08 06:24:56.0  )
బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుల విడుదల.. వెంటనే మరో షాక్ ఇచ్చిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంచల్‌గుడ జైలులో ఉన్న నిందితులు సింహయాజీ, రామచంద్ర భారతి, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింహయాజీ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితులకు కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఉదయం రామచంద్ర భారతి, నందకుమార్‌లు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.

అయితే, జైలు నుంచి విడుదలైన రామచంద్ర భారతి, సింహయాజీలకు బంజారాహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. విడుదలైన వెంటనే వారిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఇటీవల బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో రామచంద్ర భారతి, నందకుమార్‌లపై నమోదైన వేర్వేరు కేసులకు సంబంధించి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైన చీటింగ్, ఫోర్జరీ కేసుల్లో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్, పాస్‌పోర్టు కేసులో అదుపులోకి తీసుకున్నారు.

Also Read....

కీర్తించడంతో సరిపెట్టి.. తీవ్ర నిరాశను మిగిల్చిన సీఎం కేసీఆర్!

Advertisement

Next Story