BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

by Shiva |   ( Updated:2024-05-14 09:13:56.0  )
BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లింమెంటరీ చార్జ్‌షీట్‌ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కవితను ఈ సారి ఈడీ అధికారులు నేరుగా కోర్టుకు తీసుకురాకుండా వర్చువల్‌గా విచారణకు హాజరుపరిచారు. అదేవిధంగా కవిత చార్జ్‌షీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అదేవిధంగా, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ, దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది.

Advertisement

Next Story