BREAKING: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌.. ఉత్తర్వులు జారీ

by Shiva |   ( Updated:2024-07-30 09:21:26.0  )
BREAKING: విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు పక్షాల వాదనలు ధర్మాసనం కమిషన్ విద్యుత్ చైర్మన్ జస్టిస్ నర్సింహా రెడ్డి స్థానంలో మరో కొత్త చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు విద్యుత్ కమిషన్‌కు చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేసిన లోకూర్‌, 2011లో ఏపీ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తించారు.

కాగా, విద్యుత్ ఒప్పందాల విషయంలో తమపై కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్‌ తరఫున గోపాల్‌శంకర్‌ నారాయణన్‌ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చారంటూ కోర్టు ఆక్షేపించింది. నింబంధనలకు విరుద్ధంగా కమిషన్ చైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడం సరికాదని పేర్కొంది. అయితే, వెంటనే కమిషన్ చైర్మన్‌ను మార్చాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed