BREAKING: బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాలేవు.. అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Shiva |   ( Updated:2024-02-09 10:03:45.0  )
BREAKING: బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాలేవు.. అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ చరిత్రలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఎప్పడూ జరగలేదని, ఇక ముందు కూడా ఆ పార్టీలు ఒక్కటి కాలేవని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మాహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు జరగలేదని, బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా సార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. మంత్రి వర్గంలోకి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఫ్రెండ్లీ పార్టీ బీఆర్ఎస్ అని, వారిద్దరి మధ్య అవగాహనతోనే అసెంబ్లీలోకి వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. గతంలో అపరు కుబేరుడు ముఖేష్ అంబానీని ప్రమోట్ చేసిన ఘటన కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ఎవ్వరిని ప్రమోట్ చేయకుండా స్వతంత్రంగా పనిచేస్తూ.. దేశంలో పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

Advertisement

Next Story