- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: బంగ్లాదేశ్ పరిణామాలు మోదీకి గుణపాఠం కావాలి: సీపీఐ నేత నారాయణ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ జరుగుతున్న పరిణామాలు ప్రధాని నరేంద్ర మోడీకి గుణపాఠం కావాలని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని కామెంట్ చేశారు. ముస్లిం మైనారిటీలు, వారికి సంబంధించిన హక్కులను కాలరాసేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిల్లుపై తమకు కూడా అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది అప్పు మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేకంగా తామేదో రాష్ట్రానికి నిధులు వరద పారించనట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పచ్చి అబద్ధాల చెప్పారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న బంగ్లాదేశ్‌కు పట్టిన గతిని చూసి ప్రధాని మోడీకి గుణపాఠం కావాలన్నారు.
ఢిల్లీలో మాజీ సీఎం జగన్ చేపట్టిన ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలలకే రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూరంగా ఉందన్నారు.