- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ గుస్సా.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొందరికి మోదాన్ని.. మరికొందరికి ఖేదాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి ఐదోసారి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 3,38,087 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై అఖండ విజయం సాధించారు. కానీ, అయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్‌నగర్ తాము పోటీ చేసినప్పటికీ 3 వేలు ఓట్లు మాత్రమే సాధించామని తెలిపారు. ఇక సికింద్రాబాద్‌లో తమ అభ్యర్థి పోటీ చేయడం వల్ల బీజేపీ మెజారిటీ తగ్గిందని అన్నారు. అదేవిధంగా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీకి సపోర్ట్ చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఫ్రెండ్లీ పార్టీ అంటూనే బీఆర్ఎస్ తన చెత్త స్ట్రాటజీలు అమలు చేసిందని మండిపడ్డారు. ఈ క్రమంలో భవిష్యత్తులో బీఆర్ఎస్‌తో ఎంఐఎం పోత్తు కొనసాగుతుందా.. లేక అసదుద్దీన్ కాంగ్రెస్ వైపు అడుగులేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.