- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: రాజేంద్రనగర్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)
దిశ, బహదూర్ పుర : నిత్యం నగరంలో ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుండడంతో జనం పరేషాన్ అవుతున్నారు. తాజాగా కాలా పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇడ్లీ హోటల్ సమీపంలో ఉన్న స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. గోదాంలో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. చుట్టుముట్టు ప్రాంతాలలో దట్టమైన పొగ అలుముకుంది. మంటల దాటికి పక్కనే ఉన్న రెండు డీసీఎం వాహనాలు కూడా తగలబడ్డాయి. విద్యుత్ ఘాతంతో అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.