- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష నెరవేరబోతోంది.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్ : హిందువుల 500 ఏళ్ల ఆకాంక్ష నెరవేరబోతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మందుగా కనకదుర్గ ఆయల పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగబోతోందని వెల్లడించారు. హిందువుల 500 ఏళ్లు ఆకాంక్ష నెరవేరబోతోందని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో కోసం దేశంలోని కోట్ల మంది హిందువులు వేయి కన్నులతో ఎదరుచూస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దేశంలోని ప్రజలంతా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలోని పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కులమతాలు, వర్గాలకు అతీతంగా.. స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.