Olympics: ఒలింపిక్స్‌లో పతకం గెలవడం నా గొప్ప కల.. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి: నిఖత్ జరీన్

by Mahesh |   ( Updated:2024-08-04 14:26:39.0  )
Olympics: ఒలింపిక్స్‌లో పతకం గెలవడం నా గొప్ప కల.. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి: నిఖత్ జరీన్
X

దిశ, వెబ్ డెస్క్: బాక్సింగ్ లో రెండు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన తెలుగు తేజం నిఖత్ జరీన్ ఒలింపిక్స్ లో భారతదేశానికి పతకం సాధిస్తుందని అందరూ ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆమె ఓటమి చెంది పతకం రేసు నుంచి తప్పుకుంది. అనంతరం ట్విట్టర్ ద్వారా స్పందించిన నిఖత్ జరీన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన ట్వీట్‌లో ఓటమిపై స్పందిస్తూ.." ఒలింపిక్ పతకాన్ని గెలవడం నా గొప్ప కల, దాన్ని సాధించడం కోసం చివరి వరకు పోరాడాను.. కానీ కానీ విధికి ఇతర ప్రణాళికలు ఉన్నాయి. నేను ఆశించిన కల నెరవేరలేదు. ఈ ఓటమి నేను ఎదుర్కొన్న వాటిలో కష్టతరమైనది. ఇది నన్ను ఎంతో బాధిస్తోంది. ఈ ప్రపంచ వేదికపై భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కోసం ఒక సంవత్సరం గాయంతో పోరాడాను. నా స్థానాన్ని తిరిగి పొందేందుకు చాలా పోరాటం చేశాను. దాని కోసం లెక్కలేనన్ని అడ్డంకులను అధిగమించినప్పటికి సరైన ఫలితం రాలేదు. కానీ మరోసారి తిరిగి వస్తాను. ఈ క్లిష్ట సమయంలో నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. నా ప్రయాణం ఇకముందు కొనసాగుతుందని నిఖత్ జరీన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed