- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 9 నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో మరోసారి పుస్తకాల పండుగ రాబోతుంది. హైదరాబాద్‌లో ఉన్న ఇందిరాపార్క్ దగ్గర్లోని ఎన్టీఆర్ స్టేడియం పుస్తక ప్రదర్శనకు మరోసారి వేదిక కానుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ సాహిత్యాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పుస్తక పఠనం చేయించాలనే ప్రధాన ఉద్దేశంతో ‘బాల మేళా’ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గతంలో 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనకు గతంలో మంచి స్పందన లభించింది.
Advertisement
Next Story