- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొంగలతో చేతులు కలిపి మాపై నిందలా? అంటూ.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ వార్ ను తారాస్థాయికి తీసుకువెళ్తోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే అధికార పక్షం ఏకంగా విపక్ష నేతలపై లీగల్ యాక్షన్‌కు సిద్ధం అవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఉద్యోగల భర్తీ ఆపేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తోందన్న కేటీఆర్ కామెంట్స్‌పై టీకాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా శుక్రవారం మండిపడింది.
'ఏతుల రావు కారు కూతలు' అంటూ ఎద్దేవా చేసింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఇలాంటి సమయంలో బాధితులకు అండగా నిలవాల్సిన మీరు దొంగలతో చేతులు కలిపి వాళ్లను రక్షించడమే కాకుండా ఆ నిందను కాంగ్రెస్‌పై తోస్తావా అని ధ్వజమెత్తింది. ఓయూలో కాంగ్రెస్ సభ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై పార్టీ ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. సిగ్గు, శరం గుండెల్లో ధైర్యం ఉంటే మా నాయకులను హౌస్ అరెస్ట్ చేయవు అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడింది. మంత్రి కేటీఆర్ ఇంత దిగజారి మాట్లాడటం సరికాదని హెచ్చరించింది.