గంటల వ్యవధిలో మారిన BJP నిర్ణయం!

by samatah |   ( Updated:2022-12-23 06:00:16.0  )
గంటల వ్యవధిలో మారిన BJP నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ లో చేపట్టిన జన్ ఆక్రోశ్ యాత్ర రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన బీజేపీ పార్టీ తాజాగా ఆ నిర్ణయం మార్చుకుంది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నట్టు పార్టీ వెల్లడించింది. వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రైతులు, పరిపాల పరమైన సమస్యలను ఇరుకున పెట్టేలా డిసెంబర్ 1వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రను ప్రారంభించారు.

అయితే తాజాగా కరోనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ యాత్రను రద్దు చేకున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా మాట్లాడుతూ.. ఈ యాత్ర రద్దు కాలేదని వెల్లడించారు. దీంతో జన్ ఆక్రోశ్ యాత్రను తొలుత రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన చేసి ఆ వెంటనే కంటిన్యూ అవుతుందని ప్రకటించడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విషయంలో కరోనా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. రాహుల్ యాత్రపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా పేరుతో భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed