బీజేపీ బీసీ సీఎం ప్రకటన.. వాళ్ల నోట్లో మట్టికొట్టేందుకే.. : వీహెచ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-30 14:27:28.0  )
బీజేపీ బీసీ సీఎం ప్రకటన.. వాళ్ల నోట్లో మట్టికొట్టేందుకే.. : వీహెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై తాజాగా వీహెచ్ హన్మంతరావు రియాక్ట్ అయ్యారు. బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ అనడం గొప్ప విషయమని కానీ ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం అని కాషాయ పార్టీ అంటుందన్నారు. ఇదేం లెక్క అంటూ ఫైర్ అయ్యారు. బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలని, బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని ప్రధాని మోడీని కోరినా నో యాక్షన్ అన్నారు.

ఇక, బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ని అధ్యక్ష పదవిలోంచి తీసేసి కిషన్ రెడ్డిని నియమించారన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇప్పుడు బీజేపీ బీసీ సీఎం అంటుందని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని కోరారు. బీసీ సీఎం అని బీజేపీ చెప్పేది మోసమని, ముస్లింల నోట్లో బీజేపీ మట్టి కొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. బీజేపీ రిమోట్ నాగ్‌పూర్‌లో మోహన్ భగవత్ చేతిలో ఉందన్నారు.

Advertisement

Next Story