- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదంతో మరోసారి అధికారంలోకి బీజేపీ : రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
దిశ, మీర్‌పేట్: ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ నినాదంతో మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, ఈ సారి 400 పార్లమెంట్ స్థానాలు పక్కా అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం రాత్రి బాలాపూర్‌కు చేరుకున్న లక్ష్మణ్, అలేటి మహేశ్వర్ రెడ్డి ,కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మహేశ్వరం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో పెండ్యాల నరసింహ, ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి భారీ గజమాలతో సన్మానించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అనే నినాదంతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జమ్ము, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు, రామ మందిర నిర్మాణం సాకారం అయిందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీకి ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా ఓటు అడగొచ్చని, మోడీ కుటుంబం కోసం కాకుండా దేశం కోసం సేవ చేస్తున్నాడని పేర్కొన్నారు. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక ఇతర పార్టీ నుంచి అరువు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసన సభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, ఆర్కేపురం, సరూర్‌నగర్ కార్పొరేటర్లు రాధా ధీరజ్‌రెడ్డి, ఆకుల శ్రీవాణి అంజన్ కుమార్, బీజేపీ కార్పొరేటర్లు లీల రవినాయక్, పసునూరి భిక్షపతి చారి, కీసర హరినాథ్ రెడ్డి, కరుణానిధి, భీమ్ రాజ్ సోమేశ్వర్, గాజుల మధు, బీజేపీ నాయకులు, తదితరుల పాల్గొన్నారు.