BJP: పార్టీని విలీనం చేయడంలో వాజ్‌పేయిది కీలక పాత్ర.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Ramesh Goud |
BJP: పార్టీని విలీనం చేయడంలో వాజ్‌పేయిది కీలక పాత్ర.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్యం(Democracy), పత్రికా స్వేచ్ఛ(Freedom of Press) పట్ల వాజ్ పేయి(Vajpayee) నిబద్దతను చాటుకున్నారని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఏబీవీ (అటల్ బిహారీ వాజ్‌పేయి) ఫౌండేషన్(ABV Foundation) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన కేంద్రమంత్రి.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో వాజ్‌పేయికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన జీవితకాలంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana)లోని ప్రతి జిల్లాతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించాడని, ప్రేమ, విశ్వాసం, ధైర్యాన్ని ప్రేరేపించే తన అసాధారణ సామర్థ్యంతో ప్రజలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అంతేగాక ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పట్ల వాజ్‌పేయి యొక్క నిబద్ధత, ముఖ్యంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆయన సాహసోపేతమైన పోరాటం గురించి వివరించారు. జయప్రకాష్ నారాయణ్(Jayaprakash Narayan) నాయకత్వంలో జాతీయ ఐక్యతకు తన అంకితభావానికి ప్రతీకగా జనసంఘ్‌ను(Jana Sangh) జనతా పార్టీలో(Janata Party) విలీనం చేయడంలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారని కిషన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed