- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మా నోరు మూయించాలని చూస్తే మరింత తిరగబడతాం
దిశ, వెబ్‌డెస్క్: మెట్రో విస్తరణ, ఫార్మా సిటీ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మాసిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. మా నోరు మూయించాలని చూస్తే మరింత తిరగబడతామని సీరియస్ కామెంట్స్ చేశారు. అభయహస్తం దరఖాస్తులు రాజకీయ లబ్ధి కోసమే అని విమర్శించారు.
ఎలాంటి దరఖాస్తులు లేకుండా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలో అనేకమందికి రేషన్ కార్డులు లేవని.. అసలు కార్డులే లేకుండా దరఖాస్తులకు ఎలా జత చేయాలని అడిగారు. బీఆర్ఎస్‌తో సీఎం రేవంత్ రెడ్డి వ్యాపార సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం ఎవరికీ లేదని.. ప్రజలు కూడా మళ్లీ కేసీఆర్ గెలవాలని కోరుకోవడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ ఓటు వేస్తే అది చెత్త బుట్టలో వేసినట్లే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.