- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇది నూరుశాతం BRS ప్రభుత్వ వైఫల్యమే.. బండి సంజయ్ ఫైర్

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ స్టేట్ పాకిస్థాన్, శ్రీలంక మాదిరిగా ఆర్థిక పతనం దిశగా పయనిస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ద్రవ్యోల్బణం 7.63 శాతం గా ఉందని ఇది జాతీయ సగటు కంటే దాదాపు 200 బెసిస్ పాయింట్లు అధికం అని జాతీయ మీడియాలో వచ్చిన ఓ కథనంపై రియాక్ట్ అయిన బండి సంజయ్.. ఇది నూటికి నూరుశాతం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం అని ధ్వజమెత్తారు. తెలంగాణలోని ద్రవ్యోల్బణంపై కేంద్రాన్ని నిందించడం సరికాదన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు పోటీ ఇవ్వలేకపోతోందని, ఇంధనం వ్యాట్ తగ్గించడంతో పాటు రాష్ట్రంలోని ద్రవ్యోల్పణ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story