- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'టీఆర్ఎస్ అవినీతి బయటకొస్తుంటే బీజేపీ నేతల్లో భయం'
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో బీజేపీకి వాటా ఉందని, అందుకే ఈ ప్రాజెక్టు అవినీతిపైన మాట్లాడటం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరం అవినీతి కూడా బయటకు వస్తుందన్నారు. టీఆర్ఎస్ అవినీతి బయటకు వస్తుంటే బీజేపీ నేతల్లో కూడా భయం పట్టుకుందని, ఈ రెండు పార్టీల నేతల్లో జైలు భయం ఉందని ఆరోపించారు. కేసీఆర్‌కు బీజేపీ నేతలతో చీకటి ఒప్పందాలున్నాయన్నారు. బీజేపీ సభలు చూస్తుంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా ఉందని, టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని, నోట్ల రద్దు నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకు బీజేపీ, టీఆర్ఎస్ మద్దతు ఇస్తూనే ఉందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ను జైలులో పంపిస్తామని అంటున్నారని, 2014 నుంచి అవినీతిచేస్తున్న కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ నుంచి కేంద్ర మంత్రుల వరకు కేసీఆర్ అవినీతిపై మాట్లాడుతున్నారని, కేంద్రం చేతుల్లో ఉన్న ఈడీ, సీబీఐని ఎందుకు ప్రయోగించడం లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు ఉన్నందుకే ప్రజలను మభ్య పెట్టేందుకు విమర్శలు చేసుకుంటున్నారని, లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉందని చెప్పుతున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎనిమిదేండ్ల నుంచి ఎస్సీ, ఎస్టీలను వంచిస్తున్న కేసీఆర్ ఇప్పుడు రిజర్వేషన్లపై మాట్లాడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ గెలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.