MP Laxman: ఏపీలో బీజేపీ పుంజుకుంటోంది

by Gantepaka Srikanth |
MP Laxman: ఏపీలో బీజేపీ పుంజుకుంటోంది
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ(AP BJP) పుంజుకుంటోందని తెలంగాణ బీజేపీ ఎంపీ, డాక్టర్ కే.లక్ష్మణ్(MP Laxman) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్(Congress) పాలిత రాష్ట్రాల్లోనే అదానీతో ఒప్పందాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అసలు ఎజెండానే లేదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు. గొప్పలకు పోయి అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారని.. ఇప్పుడు అమలు చేయలేక తంటాలు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేసి రైతులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ మోసపోయారని అన్నారు. ఇవే హామీలు మహారాష్ట్రలోనూ ఇవ్వడంతో వారు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed