- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'శరీరంలో కేజీ కండ లేకున్నా.. కేసీఆర్ సింహం అనుకుంటున్నడు'
దిశ, తెలంగాణ బ్యూరో: 'కేసీఆర్ శరీరంలో కేజీ కండలేదు.. అయినా తనను తాను సింహం అనుకుంటాడు.. ఎలుక సింహంతో పోరాడుతుందా.. ఇక్కడ ఎలుక దేశంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న ఎలుకలతో కలిసి సింహంతో పారాడాలనుకుంటుంది. ఒక్క పంజా కొడితే ఈ ఎలుకలు ఎక్కడికి పోతాయి' అని గోషామహల్ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత రాజాసింగ్ మండిపడ్డారు. మర్యాదతో అసెంబ్లీని నడిపించాలని కేసీఆర్‌కు సూచించారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే మైక్‌లను చీరేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ జైలుకు వెళ్తాడని తెలిసి ఇలా తమాషా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారడని, ఇవన్నీ ఏమీ నడవవు అని, మోడీ వచ్చిన తర్వాత ఒక్క అవినీతి కేసు లేదు. అవినీతి చేసిన వారిని జైలుకు పంపుతున్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని చంపాపేటలో హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సదస్సును ఆదివారం నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నందుకు ప్రతిసారీ హైదరాబాద్ ఎంపీ గెలువలేకపోతున్నామని తెలిపారు. ప్రతి హిందూ బయటకు వచ్చి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఓల్డ్ సిటీ ముస్లింలను కేసీఆర్ బేవకూఫ్‌లను చేసాడని.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో ముస్లింలను బేవకూఫ్ చేయాలని వెళ్తున్నాడని మండిపడ్డారు. హిందువులతో పాటు ముస్లింలు కూడా అసద్‌ను ఇంటికే పరిమితం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
ఓటర్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. అసద్‌ను ఇంటికే పరిమితం చేసేలా కార్యకర్తలంతా ఇంతింటికీ వెళ్ళి ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ఓల్డ్ సిటీలో కార్యకర్తలపై నమ్మకం ఉందని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి సంగ్రామ యాత్ర మొదలు పెట్టి బీజేపీ సత్తా చాటారని, ఇప్పటి వరకూ ఆ సాహసం ఎవరూ చేయలేదన్నారు. ఓల్డ్ సిటీ హిందువులకు నమ్మకం కలిగించేందుకు అక్కడ నుంచి యాత్ర మొదలు పెట్టారన్నారు. ఎంఐఎం జెండా పీకి కాషాయం జెండా పెట్టాలన్న ఆలోచన ఉన్న సంజయ్ ఆలోచనను నిజం చేయాలని అన్నారు. ఈ దేశమే హిందువులది.. మోడీ మదిలో కాశీ ఉంటే.. యోగి మధిలో మధుర ఉందని, హిందువుల కలలను మోదీ-యోగి-అమిత్ షా-నడ్డాలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో మొదట ఒక్కడినే.. ఇప్పుడు త్రిపుల్ ఆర్‌లు ఉన్నామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెలంగాణకు వస్తున్నాయో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని, ఈ అంశాలను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తండ్రి కొడుకులు పెద్ద అవినీతి పరులు.. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతారని, కేసీఆర్ నీ కొడుక్కి కొంచెం తెలివి చెప్పు అని సూచించారు. తండ్రి కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నాడు, కేసీఆర్ కట్టర్ హిందూ అంటాడు.. మరి 15 నిమిషాలు టైమిస్తే హిందువులందరినీ చంపేస్తానన్న అక్బరుద్దీన్‌ను ఎలా కలుపుకుని పోతావు? అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ చేయించిన సర్వేలో తేలిందన్నారు. ప్రీ ప్లాన్ ప్రకారమే డీకే అరుణ.. జితేందర్ రెడ్డిపై కేసులు బుక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నించిందని ఆరోపించారు. గర్వంగా బతకాలంటే కేసీఆర్ జెండా పీకి పారేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త వందమంది సభ్యులను తయారు చేయాలన్నారు. జీవించాలంటే శివాజీ లాగా జీవించాలి... సంభాజీలా మరణించాలి అని స్పష్టం చేశారు. వ్యక్తి గత విభేదాలను పక్కన పెట్టి 'మన ప్రాంతంలో మన జెండా ' ఎగురవేయాలన్న సంకల్పంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.