ఎవరో చేసిన తప్పులకు ప్రజలు బలవుతున్నారు.. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే కాటిపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఎవరో చేసిన తప్పులకు ప్రజలు బలవుతున్నారు.. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే కాటిపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఎసేట్స్‌) కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడో ఎవరో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలు బలి అవుతున్నారని అన్నారు. ఈ కూల్చివేతలతో ప్రజలే తప్పు చేశారని నేతలు, అధికారులు రుజువు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మరి ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. కాగా, హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇదివరకు చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురవుతున్నాయి మొర్రో అంటూ స్థానికులు కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం చెరువు, కుంటల స్థలాలను కాపాడటానికి హైడ్రా రంగంలోకి దిగడంతో స్థానికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Advertisement

Next Story