- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'కేసీఆర్‌ను నమ్ముకుంటే మీకూ అదే గతి'
by GSrikanth |

X
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు నియోజక వర్గంలోని లెంకలపల్లి గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్ముకుంటే వాసాలమర్రికి పట్టిన గతే పడుతుందని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు లెంకలపల్లి గ్రామస్తులు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా లెంకలపల్లి గ్రామ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సీఎం ప్రకటించారని, అయితే సీఎం గ్రామస్తులను ఆకర్షించడానికి చాలా వాగ్దానాలు చేస్తారని, వాటిని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. 2020లో వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకొని రెండు సంవత్సరాల్లో ఒక్క పనిని కూడా చేయలేదని తెలిపారు.
Next Story