- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరాబర్ మాది RSS భావజాలమే.. మరి మీదేంటి?
దిశ, తెలంగాణ బ్యూరో: తమది ఆర్ఎస్ఎస్ భావజాలమని గొప్పగా చెప్పుకుంటామని, అదే కాంగ్రెస్ భావజాలమేంటో ఆ పార్టీ నేతలు చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఫైరయ్యారు. దేశ ద్రోహం, నక్సల్స్‌కు సపోర్ట్ చేయడమే వారి భావజాలమా? అంటూ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ దేశ ద్రోహులకు ఏజెంట్స్‌గా వ్యవహరిస్తోందని ఫైరయ్యారు. అలాగే కాంగ్రెస్ విడుదల చేసిన చార్జ్‌షీట్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన దాంట్లో ఒక చార్జీ లేదు.. షీట్ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక విధానాలు తీసుకుందని ధ్వజమెత్తారు.
రాజ్యాంగం మార్చే అలవాటు కాంగ్రెస్‌దేనని విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను హరించారన్నారు. కాంగ్రెస్ అనేకసార్లు రాజ్యాంగాన్ని సవరించిందని, 400 సీట్లు బీజేపీకి వస్తాయని కాంగ్రెస్ ఒప్పుకోవడం సంతోషకరంగా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ తెలంగాణలో చెల్లని రూపాయి అంటూ రాంచందర్ రావు విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ముందే ఇచ్చి ఉంటే అనేక మంది బలిదానాలు ఆగేవని ఆయన పేర్కొన్నారు. అయినా తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదని, రాష్ట్ర ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నాన్నారు. తాము రిజర్వేషన్స్ పెంచామే తప్పితే.. తగ్గించలేదని రాంచందర్ రావు తెలిపారు.