- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: లగచర్ల ఘటనపై NHRCకి ఫిర్యాదు.. ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: లగచర్ల ఘటన(Lagacharla Incident)పై జాతీయ మానవహక్కుల కమిషన్(National Human Rights Commission) కు ఫిర్యాదు చేసినట్లు మల్కాజ్‌గిరి(Malkajgiri) బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) తెలిపారు. ఫార్మా సిటీ విషయంలో రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో పాల్లొన్న వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా ధుమారం రేగుతోంది. దీనిపై ఎంపీ ఈటల ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా.. కొడంగల్ నియోజకవర్గం(Kodangal Constituency), లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్ఆర్సీ(NHRC) (జాతీయ మానవ హక్కుల కమిషన్) కి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని, ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి నియోజకవర్గం(Chief Minister's Constituency)లో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. దీనిపై వెంటనే ఎన్‌హెచ్ఆర్సీ బృందాల(NHRC Teams)ను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. దీనిపై కమీషన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ఈటల రాసుకొచ్చారు.