మునుగోడులో సందడి వాతావరణం.. ఉదయం కోమటిరెడ్డి, మధ్యాహ్నం కూసుకుంట్ల!

by GSrikanth |   ( Updated:2022-10-10 05:18:10.0  )
మునుగోడులో సందడి వాతావరణం.. ఉదయం కోమటిరెడ్డి, మధ్యాహ్నం కూసుకుంట్ల!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారు. బండి సంజయ్, తరుణ్‌చుగ్‌, వివేక్, ఈటల రాజేందర్‌, కేంద్రమంత్రులు కిషన్​రెడ్డి, భుపేంద్ర యాదవ్, లక్ష్మణ్, డీకే.అరుణలతో కలిసి రాజగోపాల్ రెడ్డి నామినేషనల్ దాఖలు చేయనున్నారు. ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమంలోనూ మంత్రులతో పాటు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు పాల్గొంటారు. మునుగోడు నుంచి చండూరు వరకు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో మునుగోడులో సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story