- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Assembly: ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అంటూ కాంగ్రెస్ మోసం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర బడ్జెట్ తెలంగాణకు రూపాయి కేటాయించలేదని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం అని కొత్త నాటకానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీ చెరో 8 సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు తీసుకొని రాలేదని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో బుధవారం మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నిధులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టిందని, అయినా స్వశక్తితో తెలంగాణను అభివృద్ధి చేశామన్నారు. 10 సంవత్సరాల నుండి ఒక్క పైసా ఇవ్వడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశారని, ఇప్పుడు కొత్త నాటకానికి తెర లేపాడన్నారు. పీఎం, బీజేపీ కేంద్ర మంత్రులను కలిశారని అయినా ప్రయోజనం దక్కలేదన్నారు.
రాజకీయ కుట్రలను ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలో తెలంగాణకు అన్యాయం చేశాయని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఏపీ ఎంపీలు హక్కుల కోసం మాట్లాడారని, మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం హక్కులు కోసం ఎందుకు అడగలేదని నిలదీశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. రెండు జాతీయ పార్టీల ఎంపీలను ఇక్కడ నుంచి గెలిపిస్తే ఒక్క రూపాయ తీసుకురాలేక పోయారన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటిల పైన నిలదీస్తామని, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.