- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీకి చేరిన బిట్స్ పిలానీ vs పల్లి బఠానీ.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రధాన పోటీలో ఉన్నారు. అయితే, ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.
సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బఠాణి.. ఏది కావాలో మీరు ఆలోచించుకోండి.. అని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విమర్శించారు. ఈ వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. ఉస్మానియాలో కేటీఆర్ దిష్టిబొమ్మ సైతం దగ్ధం చేశారు. ఈ వ్యవహారం తాజాగా ఈసీకి చేరింది. కేటీఆర్ కామెంట్స్‌పై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత మల్లు రవి తెలంగాణ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.