- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పొంగులేటి వెంట కీలక నేత?
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉమ్మడి ఖమ్మం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి చేరికకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా.. ఆయనతో పాటు మరో కీలక నేత బీజేపీలోకి చేరికకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కోరం కనకయ్య పొంగులేటితోనే కలిసి నడుస్తానని తేల్చిచెప్పారు. అంతేగాక, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన ముఖ్య అనుచరులతో పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలన్నీ కోరం కనకయ్యే దగ్గరుండి చూసుకోవడం గమనార్హం. తాజాగా.. ఇవాళ ఇల్లందులో పొంగులేటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశ ఏర్పాట్లను కోరం కనకయ్య దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అనుకోకుండా పెట్టినటువంటి సమావేశం కాదని, గత పదిహేను రోజుల క్రితమే ప్లాన్ చేశామని అన్నారు. పొంగులేటి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని, ఆయన ఎటు వెళ్తే అటే తాము కూడా అని స్పష్టం చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా కోరం కనకయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. మరి కోరం కనకయ్య నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Also Read...
ఆసక్తికరంగా భూపాలపల్లి రాజకీయం.. అదునుచూసి దూకుడు పెంచిన MLC?